అది ఏంటో నాతో పాటు చదివిన వాళ్ళు అందరు పెళ్లి చేసేసుకుంటున్నారు అప్పుడే ఏదో పెళ్లి వయసువచేసినట్టు నాకు ఏమో ఇంకా 23ఎ (*కండిషన్స్ అప్లై). ఈ పెళ్ళిళ్ళ సునామీలో ఆఖరికి మా చింతపిక్కల శీను గాడికి కూడా ఒక పెళ్లి కాకా పోయిన ఒక పెళ్లి చూపులకి పిలుపు వచ్చింది. ఆ రోజు అమావాస్య నేను, కాష్మోరా , ఖాద్ర, పీరు సాయబు ( అన్ని ముద్దు పేర్లు) మా ఊరి స్మశానం క్రికెట్ అడుకుంటున్నాం ఇంతలొ శీను గాడు వచ్చి నాకు పెళ్లి చూపులు అని చెప్పాడు 1లీటర్ వాటర్ బాటిల్ తాగి 2లీటర్ల చెమట కక్కుతూ. వెంటనే ఆ న్యూస్ కి బాల్ వెళ్లి పక్కనే నిజంగా దెయ్యాలు ఉండే స్మశానం లో పడింది. బాల్ తీసుకురావటంకి పెళ్లి అయిన వాళ్ళు ఎవరు లేక పోవటం మ్యాచ్ ఆపేసి వీడి మ్యాచింగ్ ఏంటో విందాంము అని డిసైడ్ అయ్యాం.
ఏంటిరా అమ్మాయి పేరు ఏంటి వూరు ఏంటి అన్నాడు కాష్మోరా... మీ చెల్లి పేరు ఏంటి అంటే అని మొదలు పెట్టాడు.వాడికి మా మీద ఉన్నా నమ్మకం కి మాకే ఒకింత గర్వం గా అని పించింది. అమ్మాయి జీతం, ఆస్తి, పేరు చెప్పాడు బాగానే అనిపించింది వీడికి ఎక్కువ అని పించింది. రేపు పెళ్లి చూపులు మీరు కూడా రావాలి నాతో అన్నాడు. నో నాకు రేపు ఆఫీసు లో ఫుల్ బిజీ అని చెప్పా బెట్టు చేద్దాం అని. వర్కింగ్ డే లోనే స్మశానం లో ఆడుకుంటారు మీకు ఆదివారం పని ఏంటిరా అన్నాడు. కొంచం బతిమాలించుకుని సరే అని చెప్పాము.
అది శ్రవణ ఆదివారం సూర్యుడు పొద్దునే తొమ్మిది గంటలకే ఉదయిస్తాడు అని ఆ రోజే తెలిసింది. మా అమ్మ రాత్రి మిగిలిపోయిన డిన్నర్ ని బ్రేక్ ఫాస్ట్ చేసే పని లో ఉంది. అమ్మ శ్రవణ మాసం లో సూర్యుడి పొద్దున్న తొమ్మిది గంటలకే వొస్తడా అని అడిగాను. ఏమి నాయన ఎంత పొద్దునే లేచావు ఏమి ప్రళయం వస్తుందో అంది. శీను గాడి పెళ్లి చూపులు అని చెప్పా వాడి కి పెళ్లి చూపులు ఐతే నీకు ఏంటి దీనినే వుల్లో పెళ్లి కి ఏవో హడావుడి అంటారు అంది. అవి పెళ్లి కి కదా అమ్మ పెళ్లి చూపులకి కాదు కదా అన్నా. నా తెలివి తేటలకి మా అమ్మ వెంటనే చేసే పని ఆపేసి బట్టలు వుతకటం కి వెళ్ళింది. బట్టలు బాగా సౌండ్ చేస్తున్నాయి ఆ సౌండ్ కి మా ఇంటి గోడలు పగలు కొడుతున్నట్టు అని పించింది. అప్పుడు తెలిసింది మా అమ్మకి కోపం వొస్తే బట్టలు వుతుకుతుంది అని. మా అమ్మకి బాగా కోపం వచ్చిన బట్టలే వుతుకుతుంది కాకా పొతే వంటి మిద ఉండగానే వుతుకుతుంది. ఇంతలొ నా ఎడమ కన్ను, కుడి కన్ను, గుండె, లివర్ అదరటం మొదలు పెట్టింది. ఏంటి ఈ శుభ శుచకం అని ఏమి జరుగుతుంది అని బాల్కనీ లో నుంచి కిందకి చూసాను. కాలేజీ కి వెళ్లి రెండు క్లాసులు అయిపోయి మా నాన్న ఇంటికి వొస్తున్నారు. ఇంకా ఎక్కువ టైం ఇంట్లో ఉండటం సేఫ్ కాదు అని వెంటనే మా అమెరికా మామ బ్యాగ్ లో దాచుకున్న సెంట్ తో స్నానం చేసి కొత్త చొక్కా ఒకటి వేసుకుని బయటకి పరిగెట్టాను. లిఫ్ట్ లో వెళ్ళటం కంటే మెట్ల మీద నుంచి దిగటం ఆరోగ్యం కి మంచిది అని అని దిగటం స్టార్ట్ చేశాను ( నిజం ఏంటి అంటే మా నాన్న లిఫ్ట్ లో వొస్తే మనం మెట్లు , మెట్ల మీద వొస్తే మనం లిఫ్ట్).
శీను గాడి ఇంటికి వెళ్ళాం వాడు ఇంకా రెడి అవ్వలేదు షర్టు లేకుండా తిరుగుతున్నాడు. మేము అందరం వెళ్ళగానే ఒరేయ్ ఏంటి రా ఈ డ్రెస్సులు నా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి వెళ్లి మంచి బట్టలు వేసుకు రండి అన్నాడు. అందరు మల్లి డ్రెస్సు లు మార్చటం కి కి వెళ్లారు. నేను ఇంట్లో మా టైగర్ ఉండటం వల్ల ఆగి పోయాను. ఈ సారి మంచి మెరుపు షర్టు లు వేసుకోచారు. శీను గాడి ఒక్కొక్కడి షర్టుకేసి ఆశగ చూస్తున్నాడు. రమేష్ గాడి షర్టు నచ్చింది బలవంతం గా వాడి షర్టు ఉడతియించాడు.
పదకండు గంటలు అవుతుంది వెళ్దామా అని తొందర పడుతున్నాడు శీనుగాడు వాడి చేతికి గోళ్ళు అన్ని అయి పోయినాయి ఇంకా ఏమి కోరుక్కోవలో తెలియక. వాళ్ల నాన్న పన్నెండు గంటలకి వెళ్తే అక్కడే భోజనం చేసి రావచ్చు అని లోపల ఉన్నా మాస్టర్ ప్లాన్ ని బయట పెట్టారు. పన్నెండు గంటలకి స్టార్ట్ అయ్యాము ..ఒకే ఆటో లో పదకండు మంది ని ఎక్కించాడు వాళ్ళ నాన్న మా బైక్ ల మీద వస్తాం అంకుల్ అన్నా అమ్మ అయ్యా సంపాదిస్తుంటే మీకు నొప్పి తెలియటం లేదు అందరు ఒకే ఆటో ఎక్కండి అన్నాడు. ఆటో వాడు బ్రేక్ అనుకుని నా కాలు ని బ్రేక్ చేసాడు. తొమ్మిదోవ నెంబర్ కాలు ఆటో దిగే సరికి పన్నెండో నెంబర్ అయ్యింది. భోజనాల టైం కి చేరుకున్నాం. శీను గాడు సెంటిమెంటల్ గా రాహు కాలం వరకు వెయిట్ చేసి లోపల అడుగు పెట్టాడు.
కాఫీ తాగుతారా అని సౌండ్ కి నాకు ప్రాణం లేచి వచ్చింది ఆటో వాడు బాగా కాలు తొక్కటం తో తల నొప్పి వచ్చింది. భోజనం చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నా శీను గాడి బాబు అందరి తరుపున ప్రతిపక్ష నాయకుడిల నో చెప్పాడు. పెళ్లి కూతురి తండ్రి అయ్యో ఇంక బోజనాలు పెడదాం అనుకున్నాం కాఫీ తాగటంకే ఖాళీ లేని వాళ్ళు బోజనాలు ఏమి చేస్తారు కనీసం వాటర్ అన్నా తాగండి ఏమి తాగకుండా వెళ్తే మాకు మాట వస్తుంది అన్నడు ఆ మాటకీ శీను గాడి బాబు కి నోట మాట రాలేదు. నాకు అర్ధం పోయింది ఆరు నూరు అయిన నూరు నుటయబాయి అయిన ఈ పెళ్లి జరుగుతుంది అని.
అమ్మాయిని నాన్న షాక్ నుంచి తేరుకునే టైం కి ఇంకో షాక్ అమ్మాయి వచ్చింది అమ్మాయి మెడ లో బోర్డు రాసి ఉంది పెళ్లి కూతురు అని. అందం చాల మందం గా ఉంది. బ్యూటీ పార్లర్ నడిచి వస్తున్నట్టు ఉంది. అమ్మాయి రావటం తోనే గది లో కొంచం మేఘాలు కమ్ముకున్న ఫీలింగ్ వచ్చింది. వెంటనే రెండు ట్యూబ్లయిట్లు వేసి కాండిలు వెలిగించారు. అమ్మాయి కాలి వేళ్ళతో తెగ ముగ్గులు వేసేస్తుంది కొంచం ఉంటే గ్రౌండ్ వాటర్ వస్తుంది ఏమో అని డౌట్ వచ్చింది. శీను గాడిని చుస్తే వాడు కూర్చున్న కుర్చీ పెయింటు పీకేస్తున్నాడు. వీడి కి సిగ్గు లేదు అని మా క్లాసు అమ్మాయి అంతా అన్నది నిజం కాదు అని మాకు తెలిసింది.
తరవాత పోస్ట్ లో మన శీను గాడి ప్రశ్నలు మందంగా ఉన్నా అందమయిన అమ్మాయి సమాదానం తోకలుద్దాం.
No comments:
Post a Comment
Thanks for your comment, i will respond to your comment, please keep visiting on this blog.
If you have any best quotations post in comment i will update in this blog.
If you want permission to post quotations send me a email to navruk@gmail.com, i will give you the permission to post new quotations in this blog.