సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది అనుకుంటా ఇంకా కళ్ళ ముందర ఆ సీన్ ( హీరోయిన్ ఆసీన్ కాదు ) కనిపిస్తూ ఉంది. మధ్యానం మూడు గంటలకి ఫోన్ వచ్చింది బామ్మకి సీరియస్ గా ఉంది అని. వెంటనే దొరికిన డ్రెస్ వేసుకుని బయలు దేరాను. ఇలా ఫోన్ రావటం నేను పరిగెత్తుకుని వెళ్ళటం కొత్త కాదు. ఇప్పటికే అలాంటి ఫోన్ లు చాలా వచ్చాయి. అప్పటికే మా బామ్మని ఒక పాతిక సార్లు కింద 24 సార్లు పైన పెట్టారు. రాను రాను ఫోన్ కి రియాక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు తగ్గారు పైగా ఇంటికి వచ్చిన చుట్టాలు అందరు పక్కన ఎక్కడో ఉన్నా బక్కెట్ ని ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళే వాళ్ళు. అది ఏదో ఆవిడా బుక్కేట్ అందక సరిగ్గా తన్నటం లేదు ఏమో అని. ఇలా ఇంతకూ ముందు వచ్చిన ఫోన్లు తలచుకుంటూ వెళ్తున్న ఇంతలొ హాస్పిటల్ రానే వచ్చింది. బైక్ పార్కింగ్ లో పెట్టగానే అక్కడ వాడు ఒక చిరునవ్వు నవ్వాడు నేను నవ్వి వాడి చేతిలో ఒక పది రూపాయలు పెట్టాను. సారూ మళ్ళి బామ్మ గారేనా అన్నాడు. అవును అని చెప్పి లోపలకి వెళ్ళాను మా బామ్మ ఫాలోయింగ్ తలుచుకుంటూ. ఏంటో లోపల ఎ మొహం చుసిన పరిచయం ఉన్నా మొహలలానే ఉన్నాయి. అవును అన్నట్టు వాళ్ళ మొహాల్లో పలకరింపుగా చిరునవ్వు. మెల్లిగా రిసెప్షన్ దగ్గరకి వెళ్ళా వాళ్ళు కూడా నా మొహం చూడగానే బామ్మగారు 36వ రూం లో ఉన్నారు అని చెప్పారు. రూం నెంబర్ కూడా అదే మీ బామ్మ వలన వాళ్ళ పరిస్థితి ౩పువ్వులు 6కాయాలుగా ఉంది అని చెప్పటం కి ఆవిడకి ఈ రూం ఇస్తున్నారు అని కిందటి సారి బామ్మని చూడటం కి వచ్చిన వాళ్ళలో ఎవడో వేసిన కుళ్ళు జోక్ తలచుకుంటూ రూం లోకి వెళ్ళాను.
లోపల అంతా పరిచయం ఉన్నా పరిస్థితులే డాక్టర్ అక్కడే ఉన్నాడు వెల్ కం యంగ్ మాన్ ఏంటి కిందటి సారికంటే కొంచం చిక్కవే అన్నాడు ఏదో బంధువు లు అడిగినట్టు పలకరించి పోయాడు. హి హి హి అన్నా వాడి పలకరింతకీ. బెడ్ మీద బామ్మ కాలు మీద కాలు వేసుకుని జెమిని టీవీ లో వచ్చే ఏదో సీరియల్ ని సీరియస్ గ చూస్తుంది. ఆవిడని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన పని మర్చి పోయి సీరియల్ లో మునిగి పోయారు. నేను కుడా నన్ను చూసిన నలుగురికి పలకరింతగా ఒక నవ్వు నవ్వి రూం లో ఒక మూలన కూర్చున్న. మా బామ్మ ఇంకా టీవీ లో మునిగిపోయింది ఒక ౩౦ నిముషాలు అంతా నిశబ్దం. ఒక అరగంట తరవాత మా బామ్మ ఆవేశంగా ఆ అభి ని నరికేయాలి అంది ఆవేశంగా ఉగిపోతూ ఈ అభి ఎవరు అనుకున్నా అంతలో పక్కనే ఉన్నా ఇంకో బామ్మ గారు అది మాత్రం ఏమి చేసి చస్తుందిలే అని ఒక డాయిలాగు వేసింది. అప్పుడు అర్ధం అయ్యింది బహుశా వాళ్ళు మాట్లాడుకుంటుంది ఆ సీరియల్ లో విలన్ ఆంటీ గురించి అని. సీరియల్ మద్యలో ప్రకటనలు స్టార్ట్ అవ్వగానే ఒక బామ్మగారు నీకు ఎంత కష్టం వచ్చి పడింది సుబ్బులు అంటు ఒక రాగం తీసింది వచ్చిన పని గుర్తు వచ్చినట్టు. పక్కనే ఉన్నా బామ్మలు అందరు కోరస్ అందుకున్నారు దుక్కలాగా ఉండే దానివీ ఒక చేతితో వంద మందికి వండిపెట్టే దానివీ అని. ఇంతలొ టీవీ సీరియల్ స్టార్ట్ అయ్యింది మరల బామ్మలు ఏడుపు కొంచం సేపు ఆపి టీవీ లో నిమగ్నం అయ్యారు. ఈలోగా డాక్టర్ లోపలకి వచ్చాడు కాలు పెట్టె సందు దొరకలేదు వెంటనే కోపంగా ఇంతా మంది ఉండకూడదు లోపల అని ఒక గుంపు ని బయటకి పంపాడు. అయ్యో ఏది ఏమి సోద్యం మనిషి కి బాలేక పొతే మనిషి సాయం ఉండకూడదు అంట ఏమి ఆక్టర్l లో ఏంటో అంటు బయటకి వెళ్లారు. వెళ్తూ ఇంకో పది nimishalu అన్నా ఆగి చావలేక తూ ఈ లోపల ఆ సీరియల్ అయిపోయేది అంటు ఇంకో బామ్మ సణుగుడు.

sridhar mama stoy O-range lo unde mama
ReplyDeletetelugu story chala bagundi.........
ReplyDelete