సమయం: సెప్టెంబర్ 11, 2007 మధ్యానం 12 గంటలు
స్థలం : గుంటూరు హిందూ కాలేజీ
కొద్ది నెలల తరవాతా
సమయం: మార్చ్ 11, 2008 మధ్యానం 12 గంటలు
స్థలం : హైదరాబాద్ కోటి వుమెన్స్ కాలేజీ
పి.జి. ఈజీ గా పాస్ అయిన నేను సాఫ్ట్ వేరు జాబ్ చేద్దాం అని హైదరాబాద్ కి వచ్చాను. ఒక 5,6 నెలలు ఖాళి గా తిరిగిన తరవాత మా చుట్టాల అయన వాళ్ళకి తెలిసిన కంపెనీ లో జాబ్ కి కుదిర్చాడు. నీకు ఏమి రాదు కాబట్టి వాళ్ళే 6 నెలలు .Net మిద ట్రైనింగ్ ఇస్తారు బాగా నేర్చుకుంటే అప్పుడు వేరేది చూద్దాం లే అన్నాడు. కొత్త సినిమాలు రిలీజ్ లు ఏమి లేక పోవటం, కాలేజీ లకి శెలవులు కావటం అసలే ఎండాకాలం A/C పట్టున కూర్చుందాం లే అని ఒక అని చెప్పను.
కంపెనీ పేరు ఏంటి అని అడిగాను: అగమ్యం అని చెప్పాడు. మన తెలుగోళ్ళు సాఫ్టువేర్ కంపెనీలు పెట్టిన తరవాత సాఫ్టువేర్ కంపెనీ పేర్లకి తెలుగు సినిమా పేర్ల కి పెద్ద తేడ కనపడటం లేదు. సత్యం, నిజం, అగమ్యం, అన్యక్రంతం అని అన్ని పేర్లు వచ్చేసాయి. సాఫ్టువేర్ అంటే పేరులో సాఫ్ట్ ఉండాలి అని నా ఉద్దేశం.
మొదట్లో .Net కి ముందర అంత చుక్క (.) ఎందుకు పెడుతున్నారో అర్ధం అయ్యేది కాదు. ఫ్రెండ్ ఎవడో చెప్పాడు అది కూడా కలిపి చదవాలి అని. అయిన .Net ని పుల్ స్టాప్ నెట్ అని చదివే నాకు ఆ అగమ్యం కంపనియే కరెక్ట్ లే అని ఓకే చెప్పేసాను.
జాయిన్ అయ్యే డేట్ రానే వచ్చేసింది వెళ్లి మొదటి రోజు ఆఫీసుకి వాస్తు చూసాను బాగానే ఉంది 4,5 అమ్మాయి లు బాగానే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ టీం లో నే జాయిన్ అవ్వాలి అని. అదృష్టం హీరో సైకిల్ మీద వెళ్తుంటే దరిద్రం హీరో హోండా మీద వెళ్తుంది అని వాళ్ళ ఎవరి టీం లో కాకుండా సిక్కం లాటరీ సింగిల్ నెంబర్ లో మిస్ అయినట్టు మొహం పెట్టుకునే కుటుంబ రావు టీం లో వేసారు. మొదటి రోజే సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్ లో అమ్మితే 250 రూపాయలు వచ్చే సైజు లో ఉన్నా పుస్తకం ఒకటి ఇచ్చి నువ్వు VB.NET, ASP.NET, C#.NET మీద వర్క్ చెయ్యాలి కాబట్టి అవి చదువు అన్నాడు. అది ఏంటి మా మామయ్య ఒక .NET ఎ అని చెప్పాడు కదా అన్నా. వాడు వెయ్యి సార్లు పెన్సిల్ చెక్కిన బ్లేడు తో గుండు గీయించుకుంటున్న అంతా చిరాకు గా మొహం పెట్టాడు. వెంటనే బయట ఏదయినా ఇన్స్టిట్యూట్ లో కోర్సు జాయిన్ అవ్వు అన్నాడు. మంచి ఇన్స్టిట్యూట్స పేరు మీరే చెప్పండి సార్ అని అడిగాను. అన్ని నేనే చెప్తే నువ్వు ఏమి చేస్తావు వెళ్లి గూగుల్ చేయి వెతుకు అన్నాడు.
నేను నా కంప్యూటర్ దగ్గరకి వెళ్లి గూగుల్ ఓపెన్ చేసి " My Mammaya said read .NET my Team lead Kutumba rao said read VB.NET,ASP.NET, C#.NET i want institutes in hyderabad to teach all the above" అని గూగుల్ సెర్చ్ చేశాను. మానిటర్ 33 రంగుల్లోకి మారి చివరకి తెల్ల మొహం వేసి " NO Results Found" అని వచ్చింది. వెళ్లి మా టీం లీడ్ దగ్గరకి వెళ్లి హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ ఏమి లేవు సార్ అని చెప్పాను. ఇంకొంచం చిరాకుగా ఏమి వెతికావు అని నా కంప్యూటర్ దగ్గర కి వచ్చి చూసాడు. నా సెర్చింగ్ చూసి ఇందాక గీయించుకున్న గుండు మీద Dettol పోయించుకున్న ఫీలింగ్ పెట్టాడు. ఇలా కాదు అని ఆమీర్ పేట్ లో పీర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ జాయిన్ అవ్వు అని చెప్పాడు.
తరవాత రోజే పీర్స్ కి వెళ్ళాను. ఫీజు ఎంత అని అడిగాను .NET కి ఐతే 6500 అని చెప్పింది నేను .NET మాత్రమే కాదు నాకు " My Mammaya said read .NET my Team lead Kutumba rao said read VB.NET,ASP.NET, C#.NET i want institutes in hyderabad to teach all the above" కావలి అని చెప్పాను. అబ్బ అబ్బ మీరు కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు మా దగ్గర సేం అలాంటి కోర్సె ఉంది ఇంకా హైదరాబాద్ లో ఎవరి దగ్గర లేదు దానికి ఐతే 10,000 అని చెప్పింది. అహ ఏమి తెలియని హైదరాబాద్ లో నాకు ఏమి కోర్సు కావాలో ఎవరి హెల్ప్ లేకుండా ఎలా కానీ పెట్టేసనో అని కొంచం గర్వం గా ఫీల్ అయ్యాను.
అదే రోజు క్లాసు లోకి వెళ్ళాను అది క్లాసు లాగ లేదు ఏదో సినిమా హాల్ లాగ ఉంది. ఒక 7,8 వందల మంది ఉన్నారు నాకు ఎక్కడా స్తంబం వెనకాల, గోడ పక్కన ప్లేస్ దొరకలేదు ఆ ప్లేస్ లకి బాగా కంపెటిషన్ ఉంది. క్లాసు లో సారూ ఒక 10 T.V లు పెట్టి అందులో పాఠం చెప్తున్నాడు. ఈ మాత్రం T.V కి వీడికి 10,000 కట్టాలా ఆ మాత్రం T.V మా దగ్గర కూడా ఉంది అక్కడ ఐతే రిమోట్ కూడా మన దగ్గరే ఉంటుంది అని క్లాసు కి వెళ్ళటం మానేసాను. ఆఫీసు లో మా టీం లీడ్ కి మాత్రం రోజు క్లాసు కి వెళ్తున్న అని చెప్పాను.
***
సమయం : సెప్టెంబర్ 11 2006, ఉదయం 10:36 నిముషాలు
స్థలం : అగమ్యం ఆఫీసు నా డెస్క్
కుటుంబ రావు: ఈ 6 నెలలు నువ్వు .NET బాగా నేర్చుకున్నావు అని నమ్ముతున్నాను. రేపటి నుంచి నిన్ను టీం లో వేస్తున్నాం. నీ టీం లీడ్ పేరు శ్రుతి అని చెప్పాడు . పేరు వినగానే ప్రేమించేయాలి అని పించింది.
ఒక పక్క ఆఫీసు లో ఉన్నా అందమయిన అమ్మాయి టీం లోకి వెళ్తున్నదుకు ఆనందంగా ఉన్నా ఈ 6 నెలలు నేర్చుకున్న .NET తలచుకుంటే భయంగా కూడా ఉంది. అసలు 6 నెలలు ఏమి నేర్చుకున్నన అని ఆలోచిస్తూ నా కంప్యూటర్ ఆన్ చేసి గూగుల్ టాక్ లోకి లాగిన్ ఇన్ అయ్యాను.
Hi....Hi.....Hi.....Hi....' అని నాలుగు విండోలు తెరుచుకున్నాయి....హేమ, ప్రియ , దీప్తి , నరేంద్ర ఆన్లైన్ ఉన్నారు..
హేమ - ఏంటి లేటయ్యింది?
నేను - అవును..లేటయ్యింది..
ప్రియ - చాక్లెట్ తెచ్చావా?
నేను - నువ్వు డబ్బు తెచ్చావా?
ప్రియ - తెచ్చా
నేను - ఇలా ఇవ్వు...వెళ్ళి పట్టుకొస్తా
దీప్తి - భవ్......హహహ....భయపడ్డావా
నేను - ప్లీజ్ యా....పొద్దున్నే అలా భయపెట్టకు
నరేంద్ర - రేయ్...ఇవ్వాళ డేట్ ఎంత?
నేను -
హేమ - టిఫిన్ చేసావా....ఇవ్వాళ మా ఇంట్లో ఇడ్లీ..చట్నీ భలే ఉండింది...నీకు పెట్టనుగా...హహహ.
నేను - నేను కూడా ఇడ్లీనే తిన్నా...మీ నాన్న అదే హోటల్ నుండి పార్సెల్ కట్టించుకెళ్ళాడు నువ్వు బాగా మెక్కవ ?..
ప్రియ - నీకొక విషయం తెలుసా...కిషోర్ ఇవ్వాళ పొద్దున్నే బాసుకు రవ లడ్లు, మెరపకాయ బజ్జీలుతెచ్చిచ్చాడు...ఈ సారి వాడి ప్రమోషన్ గ్యారంటీ..
నేను - అసలు వాడికి సిగ్గుందా?? ఇరిటేటింగ్ ఫెలో..
ప్రియ - నాకు కూడా అదే అనిపించింది...ప్రమోషన్ కోసం మరీ ఇంత దిగజారటమా?
నేను - ప్రమోషన్ గురించి కాదు..బుధ్ధున్నోడు ఎవడయినా మెరపకాయ బజ్జీలు పొద్దున తెస్తాడా?? సాయంకాలం స్నాక్స్ టైములో తీసుకురావాలి కానీ....
నరేంద్ర - రేయ్...ఉన్నావా....రిప్లై ఇవ్వరా...
నేను -
దీప్తి - బోర్ కొడుతోంది...బ్రేక్ కు వెళదామా?
నేను - టూ మినిట్స్
హేమ - నువ్వు, దీప్తి బ్రేక్ కు వెళ్తున్నారట గా...ఇప్పుడే పింగ్ చేసింది..అవును లే..మమ్మల్ని ఎందుకుపిలుస్తారు..పెద్ద వాళ్ళయిపోయారు..
నేను - ఏంటి హేమ..అలా అంటావు..నేనే నిన్ను పిలుద్దామనుకుంటున్నా ...ఈ లోపే నీకు చెప్పేసిందా??
ప్రియ - నిన్న రాత్రి మీ ఇంట్లో ఏమి కూర?
నేను - ఒక్క నిముషం..ఇప్పుడే వస్తా..
నరేంద్ర - రేయ్...ఉన్నావా....రిప్లై ఇవ్వరా...
నేను -
నరేంద్ర - రేయ్...ఇవ్వాళ రాత్రికి PVR లో సెకెండ్ షో బొమ్మరిల్లు సినిమా టికెట్లు దొరికాయి..
నేను - ఆ చెప్పరా...ఇంతసేపు టీం లీడ్ తో ఒక కాల్ లో ఉన్నాను.....షో ఎన్నింటికి?
అప్పుడు అర్ధం అయ్యింది నా 6 నెలలు నెట్ గర్బం లో కలిసి పోయినాయి.
ఆ రోజు రాత్రి బొమ్మరిల్లు సినిమా చూసి రూం కి వచ్చి పడుకుందం అంటే నిద్ర రావటం లేదు మొదటి రొజే శ్రుతి ని ఎలా ఇంప్రెస్స్ చెయ్యలా అని అలోచించి అలోచించి చివరికి ఒక ఐడియా వచ్చింది బొమ్మరిల్లు లో హీరో సిధార్థ లాగ మాట్లాడితే అమ్మాయి లు ఇంప్రెస్స్ అవుతారు అని. వెంటనే రెండు మరమరాల ఉండలు తీసుకుని నోట్లో పెట్టుకుని మాట్లాడటం ప్రాక్టీసు చేశాను ఆ రాత్రి అంతా తెల్ల వారె సరికి బుగ్గలు వాచీ సిధార్థ లాగ మాట్లాడటం వచ్చేసింది.
సమయం : సెప్టెంబర్ 12 2006, ఉదయం 9:36 నిముషాలు
స్థలం : అగమ్యం ఆఫీసు నా డెస్క్
డెస్క్ లో నుంచి సెంట్ తీసి మళ్ళి ఒక సారి స్నానం చేశాను. 10 గంటలకి శ్రుతి ఆఫీసు కి వచ్చింది. వెంటనే నన్ను పిలుస్తుంది అనుకున్నా కాని లయిట్ తెసుకున్నట్టు ఉంది. ఛి రూం నుంచి మరమరాల ఉండలు తెచ్చుకుని ఉంటే పిలిచే వరకు ప్రాక్టీసు అన్నా చేసే వాడిని అనుకున్నా.
మధ్యానం లంచ్ తరవాత శ్రుతి నుంచి కాల్ వచ్చింది కం టూ మై డెస్క్ అని. శ్రుతి ని చూడగానే డిసైడ్ అయ్యాను పెళ్లి అంటు చేసుకుంటే ఈ అమ్మాయి ని చేసుకోవాలి .. కుదరక పొతే ఇంకో అమ్మాయి ని చేసుకోవాలి అని. వెళ్లి పక్కన నిలపడ్డాను కూర్చో అంది. శ్రుతి ని చూడగానే డిసైడ్ అయ్యాను పెళ్లి అంటు చేసుకుంటే ఈ అమ్మాయి ని చేసుకోవాలి .. కుదరక పొతే ఇంకో అమ్మాయి ని చేసుకోవాలి అని హాహహ పర్వాలేదు అండీ. అండీ లు ఏమి అవసరం లేదు శ్రుతి అను చాలు అంది.(ఇంతకన్న ఇన్ డైరెక్ట్ గా అమ్మాయి లు ఎలా చెప్తారు అమ్మాయి అన్నాక ఆ మాత్రం సిగ్గు కామన్ లే అని ఫీల్ అయ్యి ) చైర్ తీసుకుని కూర్చున్న. ఇంతా వరకు ఏమి నేర్చుకున్నావు అని అడిగింది. ఫస్ట్ ప్రశ్నే చాల కష్టం అయినది అడిగింది. నేను my mamayya....... అన్నాను. సరే అని తల గోక్కుని సరే .NET లో చిన్న ప్రాజెక్ట్ ఇస్తాను ట్రై చేయి అంది. IDE అని ఏదో ఓపెన్ చేసి CREATE FORM అని ఏదో నొక్కింది.
శ్రుతి : ఇప్పుడు ఏమి చేసానో చెప్పు ?
నేను:ఏమి ఉంది అక్కడ నొక్కారు ..
శ్రుతి : నొక్కటం కాదు స్వామి ... ( అనగానే నాకు పాత సినిమా లో న్త్ర్ కాళ్ళ దగ్గర హీరోయిన్ స్వామి స్వామి అంటు కాళ్ళు నొక్కే సీన్ గుర్తు వచ్చి అలానే చూస్తూ ఉన్నా)
శ్రుతి: బాబు బాబు ఇక్కడ నేను అడిగింది operation ఏంటి అని అంది ?
నేను: ఆపరేషన్ ఏమి ఉంది ప్రెస్సింగ్ ఆపరేషన్.
శ్రుతి: ఉఫ్ ఉఫ్ ...
శ్రుతి: సారు కుటుంబరావు గారు ఈయన ని భరించటం నా వాళ్ళ కాదు మీ టీం లోనే ఉంచుకోండిఅంది :(
కుటుంబ రావు చాల చిరాకుగా మొహం పెట్టి మళ్ళి నన్ను నా డెస్క్ దగ్గర కూర్చో పెట్టాడు .
నాకు చాల బాధ అని పించింది వెంటనే .NET నేర్చుకుందాం అని కంప్యూటర్ ఆన్ చేశాను .
Hi....Hi.....Hi.....Hi....' అని నాలుగు విండోలు తెరుచుకున్నాయి....
story chala bagunde
ReplyDeletestory bagundi chaduvutunta pst days gurthuklostunnaye
ReplyDeleteinthaki ippudu em chestunnaru? .NET nerchukunnara?
ReplyDelete