Enjoy Friends


Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
Google+
Showing posts with label Telgu Poems. Show all posts
Showing posts with label Telgu Poems. Show all posts

November 03, 2011

Friendship Quote in Telugu Select your friend..

కురిసే ప్రతి వర్షపు బిందువు స్వాతిముత్యము కాలేదు!
విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని వెదజల్లలేదు!
ప్రవహించే ప్రతి వాగు సెలయేరు కాలేదు!
కనిపించే ప్రతి రాయీ విగ్రహం కాలేదు!
ఎదురయ్యే ప్రతి మనిషీ స్నేహితులు కాలేరు!!

అందుకే ప్రతి వారి మనసు మధనపడుతోంది ఎవరితో చేయాలి స్నేహం అని?... 


ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవదనికే ఎలాంటి qualities ఉండాలి మరి...? 

August 12, 2011

Friendship Day Quote in Telugu


చినుకుల లా మొదలైన మన స్నేహం 
వర్షం లా కురిసీ 
సెలయేరు లా సాగి 
నది లా ప్రవహించి , ఎప్పటికి ఇంకిపోని 
సముద్రం వలె ఉండాలని ఆశిస్తూ ...... నీ నేస్తం 


April 30, 2011

Love with Friendship

ప్రేమ  ఎప్పుడు  పుడుతుంది 
మనషు  దగ్గర  ఐనప్పుడు 
మనుషు  ఎప్పుడు  దగ్గర  అవుతుంది 
మనిషి  కి  మనిషి  దగ్గర  ఐనప్పుడు
మనిషి కి  మనిషి  ఎప్పుడు  దగ్గర అవుతాడు
మనసు లో స్నేహం చుగురించి నప్పుడు.

Prema eppudu puduthundi
manashu daggara ainappudu
manushu eppudu daggara avuthundi
manishi ki manishi daggara ainappudu
manishi ki   manishi  eppudu daggara avutadu
manasu lo sneham chugurinchi nappudu 

True Friendsip Quotation in Telugu

నీ  ప్రేమను  పొందలేనేమో  కాని  నిన్ను  ప్రేమించగలను.
నీతో  కలసి  జీవించ  లేనేమో  కాని  నీకై  మరనిన్చాగాలను
నీలో  నేను  లేకపోయినా  నీ  తలపులలో  సదా  గుర్తుకు  వస్తుంటాను.

Nee premanu pondalenemo kaani ninnu preminchagalanu.
Neetho kalasi jeevincha lenemo kaani neekai maraninchagalanu
Neelo nenu lekapoyina nee talapulalo sadaa gurtuku vastuntaanu. 

Friendsip Quotation in Telugu

జారిపోకు  మేఘమా  ఝల్లు  కురిసే  వరకు.
వాడిపోకు  పుష్పమా  వసంతం  వచ్చే  వరకు.
మరచిపోకు  మిత్రమా  నా  ప్రానమున్నంత  వరకు.

Jaripoku meghamaa jhallu kurise varaku.
Vaadipoku pushpamaa vasantam vachche varaku.
Marachipoku mitramaa naa praanamunnanta varaku. 

August 13, 2010

My Father


మానాన్న ప్రతీరోజూ బుధ్దుడే..
మా అందరినీ గాఢనిద్రలో వదిలేసి
తనొక్కడే మెలకువ రాగం పాడుకుంటూ
వెళిపోతాడు...
నైట్‌డ్యూటీకి!

----భాస్కరభట్ల

July 26, 2010

Mother Love

ఇంటిల్లిపాదికీ
చాకిరీచేసి అలసిపోతున్న
మా అమ్మని చూసి
నుదుటిమీది కుంకుమబొట్టు
బొట్లు బొట్లుగా ఏడుస్తోంది!

----భాస్కరభట్ల

Never Forgettable Things

తప్పిపోయిందనుకున్న బాల్యాన్ని
మా అమ్మ పాత ట్రంకుపెట్టె అడుగున
నా చిన్నప్పటి ఫోటోలో
మళ్ళీ చూసుకుంటున్నాను!!!


----భాస్కరభట్ల

No Boundaries

చిన్నప్పుడోసారి..
మానాన్న కళ్ళద్దాలు పగలగొట్టేశా..
చెంపఛెళ్ళుమనిపించాడు.!

ఇప్పుడేనయం..
ఎంచగ్గా బస్సుఅద్దాలు పగలగొట్టినా
అడిగేవాడే లేడు!

----భాస్కరభట్ల

Broken Heart

Love Notes Broken Heart Necklace - Clearance Final Saleఇప్పుడసలు
గుండెలు చెమ్మగిల్లడమే లేదు!
వర్షం వచ్చినప్పుడు
గోడలు తప్ప!

---- భాస్కరభట్ల

Dont forget ya...!

అతగాడికి ఈమధ్య
మతిమరుపు మరీ ఎక్కువైనట్టుంది...
కనిపించిన వాళ్ళనే కాదు
కని-పెంచిన వాళ్ళనికూడా
మరిచిపోతున్నాడు!

----భాస్కరభట్ల

It helps you..

సిగరెట్ కాల్చే అలవాటున్నందుకు
నన్ను నేనే తిట్టుకున్నాను.
అదేదో అరోగ్యానికి హానికరమని కాదు!
నీ ధ్యాసలోపడి
మైమరచిపోతుంటే...
నా ఆలోచనల్ని చెడగొట్టిందీ..
విలన్‌లా అడ్డుపడిందీ..
చేతివేళ్లమధ్య చుర్రుమన్న
ఆ సిగరెట్టే!

----భాస్కరభట్ల

Part of my heart

నాలో నువ్వు సగం
నేను సగం అన్నావు.!
నేనిప్పుడు ఆలోచిస్తున్నది...
నాలో నువ్వులేని మిగతా సగం
నాకుమాత్రం ఎందుకని?

----భాస్కరభట్ల

Be With Me...!

నువ్వు
నాసమక్షంలో ఉన్నప్పుడు
దండెంమీద ఆరేసిన పట్టుపంచెలా
రెపెరెపలాడిపోతుంది
మనస్సు!

కాసేపు నువ్వు కనిపించకపోతే...
చిలక్కొయ్యకి తగిలించిన చొక్కాలా
విలవిల్లాడిపోదూ?

----భాస్కరభట్ల

Try to Understand me....!

The Eyeకళ్లు మూసుకుపోయి
ప్రవర్తిస్తున్నానని
అందరూ నన్ను తిడుతున్నారు.
కళ్లు మూసుకుంటేనే
కల వస్తుందనీ,
ఆ కలలో నువ్వు కనిపిస్తావనీ
నేనెలా చెప్పేది?

----భాస్కరభట్ల

Burning Heart

Hand Made Womens Retro "Tattooed Burning Heart" Chain Necklace Pendantమొక్కజొన్న కంకుల్ని
అందరూ కాల్చుకు తింటారని తెలుసు!
ఇలా..
గుండెల్ని కాల్చుకు తినేదొకటుందని
ప్రేమలో పడ్డాకే
తెలిసింది!

----భాస్కరభట్ల

Oh my got.....! CAT....?

All Cats Have Asperger Syndromeఎలాంటి సమస్యలనైనా
ఎదిరించి బతుకుతున్న…వాడు.!
పిల్లి ఎదురొస్తే
ఎందుకో
భయపడుతున్నాడు!

----భాస్కరభట్ల

Small Doubt

Music From The Motion Picture P.S. I Love Youనువ్వెక్కడుంటే
నేనక్కడుంటా
అన్నాడతను పొయెటిగ్గా...
మరీ అంత అనుమానమా..అని
అతని ప్రేమని
వొద్దనేసిందామె చిరాగ్గా!

----భాస్కరభట్లlo

Waiting for You

నీకోసం
గుడిలో నిరీక్షిస్తుంటే
గుడిగోపురమెక్కి చూస్తోంది
మనస్సు!

----భాస్కరభట్ల

Power of Lady

Bravado Womens Lady Gaga Rock Show T-Shirt, White, Medium

నా వెనక వందలమంది సైనికులున్నారు,
నా చేతిలో ak-47 వుంది
అయినా ధైర్యం రావట్లేదు...!

నన్ను చూసి ప్రేమగా
ఓ నవ్వు విసిరావు చూడూ...
ఆ క్షణంలో
ధైర్యమేంటి..ఏకంగా తెగింపే వచ్చేసింది!!!
----భాస్కరభట్ల
Blogger Tips And Tricks|Latest Tips For Bloggers Free Backlinks

How is Narendra Modi Work?