Enjoy Friends


Welcome to Nice Quotes, the place to find More than 1,000+ quotations based on famous quotes - funny quotes - Telugu quotations - cute quotes - inspirational quotes - motivational quotes - famous sayings - humorous quotes - great quotes - sardar jokes - love story - punchline - sms - elephant jokes - jokes and love quotes.
Google+

August 31, 2009

Four ants and One Elephant


Four Ants are moving through a forest.They see an ELEPHANT coming towards them.

Ant 1 says : we should KILL him.
Ant 2 says : No, Let us break his Leg alone.

Ant 3 says : No, we will just throw him away from our path.
Ant 4 says : No, we will LEAVE him because he is ALONE and we are FOUR.

August 13, 2009

మా బామ్మ బక్కెట్ తన్నిన రోజు

సరిగ్గా నాలుగు నెలలు అవుతుంది అనుకుంటా ఇంకా కళ్ళ ముందర సీన్ ( హీరోయిన్ ఆసీన్ కాదు ) కనిపిస్తూ ఉంది. మధ్యానం మూడు గంటలకి ఫోన్ వచ్చింది బామ్మకి సీరియస్ గా ఉంది అని. వెంటనే దొరికిన డ్రెస్ వేసుకుని బయలు దేరాను. ఇలా ఫోన్ రావటం నేను పరిగెత్తుకుని వెళ్ళటం కొత్త కాదు. ఇప్పటికే అలాంటి ఫోన్ లు చాలా వచ్చాయి. అప్పటికే మా బామ్మని ఒక పాతిక సార్లు కింద 24 సార్లు పైన పెట్టారు. రాను రాను ఫోన్ కి రియాక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు తగ్గారు పైగా ఇంటికి వచ్చిన చుట్టాలు అందరు పక్కన ఎక్కడో ఉన్నా బక్కెట్ ని ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళే వాళ్ళు. అది ఏదో ఆవిడా బుక్కేట్ అందక సరిగ్గా తన్నటం లేదు ఏమో అని. ఇలా ఇంతకూ ముందు వచ్చిన ఫోన్లు తలచుకుంటూ వెళ్తున్న ఇంతలొ హాస్పిటల్ రానే వచ్చింది. బైక్ పార్కింగ్ లో పెట్టగానే అక్కడ వాడు ఒక చిరునవ్వు నవ్వాడు నేను నవ్వి వాడి చేతిలో ఒక పది రూపాయలు పెట్టాను. సారూ మళ్ళి బామ్మ గారేనా అన్నాడు. అవును అని చెప్పి లోపలకి వెళ్ళాను మా బామ్మ ఫాలోయింగ్ తలుచుకుంటూ. ఏంటో లోపల మొహం చుసిన పరిచయం ఉన్నా మొహలలానే ఉన్నాయి. అవును అన్నట్టు వాళ్ళ మొహాల్లో పలకరింపుగా చిరునవ్వు. మెల్లిగా రిసెప్షన్ దగ్గరకి వెళ్ళా వాళ్ళు కూడా నా మొహం చూడగానే బామ్మగారు 36 రూం లో ఉన్నారు అని చెప్పారు. రూం నెంబర్ కూడా అదే మీ బామ్మ వలన వాళ్ళ పరిస్థితి ౩పువ్వులు 6కాయాలుగా ఉంది అని చెప్పటం కి ఆవిడకి రూం ఇస్తున్నారు అని కిందటి సారి బామ్మని చూడటం కి వచ్చిన వాళ్ళలో ఎవడో వేసిన కుళ్ళు జోక్ తలచుకుంటూ రూం లోకి వెళ్ళాను.

లోపల అంతా పరిచయం ఉన్నా పరిస్థితులే డాక్టర్ అక్కడే ఉన్నాడు వెల్ కం యంగ్ మాన్ ఏంటి కిందటి సారికంటే కొంచం చిక్కవే అన్నాడు ఏదో బంధువు లు అడిగినట్టు పలకరించి పోయాడు. హి హి హి అన్నా వాడి పలకరింతకీ. బెడ్ మీద బామ్మ కాలు మీద కాలు వేసుకుని జెమిని టీవీ లో వచ్చే ఏదో సీరియల్ ని సీరియస్ గ చూస్తుంది. ఆవిడని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన పని మర్చి పోయి సీరియల్ లో మునిగి పోయారు. నేను కుడా నన్ను చూసిన నలుగురికి పలకరింతగా ఒక నవ్వు నవ్వి రూం లో ఒక మూలన కూర్చున్న. మా బామ్మ ఇంకా టీవీ లో మునిగిపోయింది ఒక ౩౦ నిముషాలు అంతా నిశబ్దం. ఒక అరగంట తరవాత మా బామ్మ ఆవేశంగా ఆ అభి ని నరికేయాలి అంది ఆవేశంగా ఉగిపోతూ ఈ అభి ఎవరు అనుకున్నా అంతలో పక్కనే ఉన్నా ఇంకో బామ్మ గారు అది మాత్రం ఏమి చేసి చస్తుందిలే అని ఒక డాయిలాగు వేసింది. అప్పుడు అర్ధం అయ్యింది బహుశా వాళ్ళు మాట్లాడుకుంటుంది ఆ సీరియల్ లో విలన్ ఆంటీ గురించి అని. సీరియల్ మద్యలో ప్రకటనలు స్టార్ట్ అవ్వగానే ఒక బామ్మగారు నీకు ఎంత కష్టం వచ్చి పడింది సుబ్బులు అంటు ఒక రాగం తీసింది వచ్చిన పని గుర్తు వచ్చినట్టు. పక్కనే ఉన్నా బామ్మలు అందరు కోరస్ అందుకున్నారు దుక్కలాగా ఉండే దానివీ ఒక చేతితో వంద మందికి వండిపెట్టే దానివీ అని. ఇంతలొ టీవీ సీరియల్ స్టార్ట్ అయ్యింది మరల బామ్మలు ఏడుపు కొంచం సేపు ఆపి టీవీ లో నిమగ్నం అయ్యారు. ఈలోగా డాక్టర్ లోపలకి వచ్చాడు కాలు పెట్టె సందు దొరకలేదు వెంటనే కోపంగా ఇంతా మంది ఉండకూడదు లోపల అని ఒక గుంపు ని బయటకి పంపాడు. అయ్యో ఏది ఏమి సోద్యం మనిషి కి బాలేక పొతే మనిషి సాయం ఉండకూడదు అంట ఏమి ఆక్టర్l లో ఏంటో అంటు బయటకి వెళ్లారు. వెళ్తూ ఇంకో పది nimishalu అన్నా ఆగి చావలేక తూ లోపల సీరియల్ అయిపోయేది అంటు ఇంకో బామ్మ సణుగుడు.

మా ఓనరు కుక్క .....

కంగారు పడకండి నేను మా ఓనరుని తిట్టటం లేదు వల్ల కుక్క గురించి చెప్తున్నా...

మా ఓనరుకి ఒక కొడుకు, రెండు కుక్కలు .... ఇక్కడ నా ఉద్దేశం మా ఓనరు కొడుకుని కుక్కతో పోల్చటం కాదు కుక్కని కూడా కొడుకులా చూసుకుంటాడు అని చెప్పటం. ఆరు నెలల క్రిందట కుకట్ పల్లి లో రెంట్లు చాల ఎక్కువగా ఉన్నాయి ఆ టైం లో మా ఓనరు కి బుక్ అయ్యాము అది బ్లాక్ లో బ్రోకర్ కి మూడు వేలు ఇస్తే చూపించాడు అందులో అయిదు వందలు మా ఓనరుకి షేర్ అట, బయట అద్దెకు అని బోర్డు పెట్టనందుకు సొంత ఇల్లు పెట్టుకుని బ్రోకర్ దగ్గర షేర్ లు కొడతారు అని అప్పుడే తెలిసింది. అప్పటి నుంచి మా ఓనరు ని ముద్దుగా అసిస్టెంట్ బ్రోకర్ అని పిలుచుకుంటు ఉంటాం. కొంచం రెంట్ ఎక్కువ అయిన అంతా బాగానే ఉంది అనుకునే టైం లో మా ఓనరు రెండు ఎక్కడ నుంచో రెండుకు కుక్కలని దింపాడు అవి గేదలకి తక్కువ కుక్కలకి ఎక్కువ అన్నట్టు ఉన్నాయి. పాపం అవి సాదు జీవులే దొంగలని కరవవు లేక పొతే మా ఓనరుని ఎప్పుడో కరిచేవి. ఆయన పెంచుకుంటే మనకి ఏంటి లే ప్రాబ్లం అనుకున్నాం కాని మా ఓనరు వైఫ్ ఫ్రీడం ఇచిన్న ఇవ్వక పోయిన కుక్కలకి మాత్రం ఇస్తాడు. ఇంకా అవి గేదల లాంటి బాడీ వేసుకుని మా రూమ్ ముందరే తిరుగుతూ ఉంటాయి. రూమ్ కి వచ్చిన వాళ్ళు వాటి పేరు చెప్పి రూమ్ నుంచి బయటకి వెళ్లారు.

ఈ మధ్య కొత్త ప్రాబ్లం ఒకటి వచ్చింది. ఇదివరకు అవి టాయిలెట్ కి బయట ఏదో ఒక చెత్త కుప్పల్లోకి పోయేవి మా రూమ్ నీట్ నెస్ చూసి ఆ చెత్తకుప్పల కంటే మా రూమ్ ఈ బెటర్ అని అనుకున్నట్టు ఉన్నాయి రోజు రూట్ మార్చి మా రూమ్ కే వొస్తున్నాయి. మొన్నటికి మొన్న మా శ్రీకాంత్ గాడు అవి డోర్ దగ్గర ఉన్నాయి అని ఒక రోజు మొత్తం బయటకి రాలేదు నిద్రాహారాలు మానేసి కిటికీ లో నుంచి జూ లో జంతువుల వాటిని చూస్తూనే ఉన్నాడు. ఇంకో రోజు రెండు షూస్ బయట వదిలితే తరవాత రోజుకు ఒకటిన్నర షూస్ మాత్రమె ఉన్నాయి. ఓనరు పెట్టె చికెన్ సరిపోక అవి చెప్పులని కూడా పప్పుల లాగ తింటున్నాయి.

ఇంకో ఫ్రెండ్ చాల రోజులు అయ్యింది అని ఒక ఆదివారం అంతా మీ రూంలోనే ఉంటాను అని వచ్చాడు ఉదయమే రెండు అంతస్తులు ఎక్కి వచ్చాడు ఎంట్రన్స్ లో వీటి ఎంట్రీ చూసి రెండో అంతస్తు నుంచి వేసిన రాయిలాగా రెండు సెకండ్స్ లో కింద ఉన్నాడు. సెలవు దినం అని వస్తే నా దినం కి తెస్తారా అని పట్టిన చెమటలని తుడుచుకుంటూ పోయాడు. ఇదే విషయం ఓనరు కి చెప్తే అవి కరవవు అని మీ ఫ్రెండ్ కి ముందరే చెప్పి ఉండాలిసింది అన్నాడు సింపుల్ గా అప్పుడు నాకు అనుకున్నా,ఎ అమావాస్య కో, పౌర్ణమి కో ఇంకా నరకం లో రిజిస్టర్ అవ్వని ఎ దయ్యమో నీ కుక్కలకి పట్టి నిన్ను కరుస్తాయి అని.


ఇవ్వాళా డిసైడ్ అయ్యాను కుక్కలు లేని టైం లో డైరెక్ట్ గా మా ఓనరు దగ్గరకి వెళ్లి మాట్లాడాలి అని. ఒకటే మాట ఉంటే ఈ ఇంట్లో ఆ కుక్క అన్నా ఉండాలి మేము అన్నా ఉండాలి అని.

మా ఓనరు కుక్క గురించి ఏమి అన్నాడో రేపు చెప్తాను .. అప్పటి వరకు సెలవు.

ఆర్దిక మాంద్యం నాకు తగిలింది.....

ఆఫీసు లో వారం రోజులనుంచి ఒకటే సందడి అందరు తెగ కష్టపడి పని చేస్తున్నారు ఎలాగు పని లేని నేను వీళ్ళు ఏమి పని చేస్తున్నారా తెలుసుకుందాం అనే పని లో పడ్డాను. ఇంతలొ మా ప్రసాదు కంగారు కంగారూగా కీ బోర్డు ని చావా బాదుతున్నాడు సరే మాస్టారిని కలిస్తే విషయమం ఏంటో తెలుస్తూంది కదా అని కదిలించాను. కీ బోర్డు మీద చెయ్యి , మానిటర్ లో తల తీయ్యాకుండా అమెరికా నుంచి మేనేజర్ లు వచ్చారు అని శుభవార్త చెప్పాడు ఎగిరి గంతు వేసిన అంట పని చేశాను ( వాళ్లు వచ్చినదుకు కాదు ఏమి అన్నా జీతం పెంచుతారు ఏమో బుల్లి నానో కారు కొనడం అని ) ఆరు నెలల నిరీక్షనకీ రోజుతో ముగింపు అనుకున్నా, కాని అది మరో వారం పెరిగింది వాళ్ళు ఒక వారం రోజులు ఇక్కడే ఉంటారు వెళ్ళే రోజు జీతాలు గురించి మాట్లాడతారు అని అభిజ్ఞ వర్గాల ద్వార తెలిసింది. సరే అని ఎదురు చూడటం కంటే చేసిది లేదు అని ఎదురుచూడటం మొదలు పెట్టాను.

ఇంతలో ఆ రోజు రానే వచ్చింది, అమెరికా నుంచి వచ్చిన మేనేజర్ లోపలకి పిలిచాడు తోలిప్రేమ సినిమా లో పవన్ కళ్యాణ్ టైపులో బాత్రూంలోకి వెళ్లి చిన్న సైజు స్టెప్స్ వేసి రూమ్ లోకి వెళ్ళాను. ఎప్పటిలగానీ అర్ధం కాని ఇంగ్లీష్ లో ఏదో చిన్నగా చెప్పి కుర్చీ చూపించాడు, అప్పుడు అర్ధం అయ్యింది నన్ను కూర్చోమన్నాడు అని వెంటనే కూర్చున్న లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటూ. మెల్లగా బ్రెడ్ కీ జామ్ రాసినట్టు పొగడటం మొదలు పెట్టాడు లోలోపల మనకి అంతుందా అనుకుంటూనే విన్న ఎంత అయిన పొగుడుతూ ఉంటే బాగుంటుంది కదా!!!! సరే కంటిన్యూ కంటిన్యూ అన్నా. కొంచం సేపటికి ఒక లెటర్ చేతిలో పెట్టాడు నీకు అయిదు వేలు పెంచుతున్నాం అని ఎగిరి గంతు వేద్దాం అనుకున్నా అలా చేస్తే బాగోదు అని ఎక్కువ సంతోషం మొహం లో కనపడనివ్వకుండా ఇంతేనా అని అన్నట్టు ఒక ఎక్స్ ప్రెషన్ పెట్టాను. సెకండ్ లో నీకు ఇదే ఎక్కువ అనే ఎక్స్ ప్రెషన్ పెట్టాడు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఏమి అడుగుతాడో అని సెలవు తీసుకుని బయటపడి హమ్మయ అని కళ్లు మూసుకున్న, ఇంతలో ఏదో పెద్ద బీరువా జరిపినట్టు సౌండ్ వచ్చింది కళ్లు తెరిచి చుస్తే ఆఫీసు లో అమ్మాయి లో ఏదో జోక్ కీ నవ్వుకుంటున్నారు నేను ఉంది మేనేజర్ రూమ్ బయట కాదు కఫ్తెరియాలో , అప్పుడు అర్ధం అయ్యింది ఇందాకటి నుంచి జరిగింది కల అని. అయిన జరగబోయేది అదే కదా అని నాలుగోవ టి తాగాను.
ఈసారి మేనేజర్ నిజంగా పిలిచాడు నా ఒక్కడినే కాదు ఆఫీసు అందరిని. ఇది ఏదో బాగుంది గుంపులో గోవింద లాగా కాగితం తీసుకోవచ్చు స్పెషల్ గా ప్రశ్నలు ఏమి ఉండవు అని లోలోపల సంతోష పడుతూ వెళ్ళాను. మేనేజర్ అందరిని ఉద్దేశించి మీకు తెలుసు ప్రస్తుతం అమెరికా అర్దికంగా కష్టాల్లో ఉన్నది అని అందువల్ల ఈసారి జీతాల్లో ఎలాంటి మార్పులు చెయ్యటం లేదు అని కేంద్ర మంత్రి పోయినప్పుడు టీవీ లో వార్తలు చదివే వాడి అంతలా ఎక్స్ ప్రెషన్ పెట్టి మరి చెప్పాడు. అన్ని ప్లాన్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కులిపోయినాయి. ఛి అనుకుని వెంటనే అయిదవ టి తాగి క్యూబ్ కీ వచ్చి చాటింగ్ మొదలు పెట్టాను మరో ఆరు నెలల వెయిటింగ్ ని తలచుకుంటూ.

నా మొదటి టపా.... Story in Telugu

సెంట్రల్ గవర్నమెంట్ లాంటి సాఫ్ట్ వేరు జాబ్ తొమ్మిది గంటలు ఆఫీసు అరగంట పని ఇంతకాలం పని చెయ్యటమే కష్టం అనీ ఫీలింగ్ లో ఉండే వాడిని పని లేకుండా కూర్చోవటం కూడా అంతా కంటే కష్టం అని ఎప్పుడు తెలుస్తూంది. సరే అలవాటు అయినా కాళీగా కూర్చునే పని కాకుండా ఇంకా ఏమి అన్నా వేరే పని చేద్దాం అని ఆఫీసు వాళ్లు ఇచ్చిన నెట్ మీద విశ్రాంతి లేకుండా వేటిkఆను బ్లాగ్ ఏదో కొంచం బాగున్నట్టు అనిపించిది. ఒకటి రెండు బ్లాగ్ లు చదవాగానే నాకు ఒక బ్లాగ్ మొదలు పెట్టాలి అనిపించింది కాని ఇది మన వల్ల అయ్యేలా లేదు అంతా బాష మన దగ్గర లేదులే అని వెనుక అడుగు వేసాను కానీ చాల బ్లాగ్ లు చదివన తరవాత అర్ధం అయింది పెద్దగా బాష లేక పోయిన బ్లాగ్ రాయవచ్చు అని పక్కింట్లో కుక్క పిల్ల - ఆకాశంలో కాకి పిల్ల, గోడ మిద పిల్లి -మంచంలో నల్లి, ఇంటికి కట్టిన గుమ్మడి కాయ- ఆఫీసు లో మా మేనేజర్ మాయ్యా , చెరువులో చేప- ఆఫీసులో పాప, ఎదురు ఇంట్లో ముద్దుగుమ్మమన ఇంట్లో మూలాపడ్డ మామ్మ దేని గురించి అయినా రాయచ్చు అని తెలుసుకుని నేను కూడా మొదలుపెట్టాను. రాబోవు టపా లో కలుద్దాం

ఆ టీవీ నాతో అడుకుంది..... Story in Telugu

అరనిమిషం పాటు ఎంతమంది సంఘ విద్రోహ శక్తుల పేర్లు చెప్పగాలవో చెప్పు చూద్దాం"అన్నాడు వంశీ.
మొదలెట్టాను"అంజలా నాయుడు,సింధునాయుడు,అమన్,సుభాకర్,రోధిక, ..........
వంశీ,"వీళ్లంతా ఎవరు"
"తెలుగు సీరియల్ నటులు,దర్శకులు,నిర్మాతలు,దర్శక నిర్మాతలు,నట గాయక చిత్రకార సంగీత దర్శక దర్శక..."
"ఆపూ..అది తెలుసు.సంఘ విద్రోహ శక్తుల పేర్లడిగితే వీళ్ల పేర్లు చెప్తున్నావేంటీ?"
"వీళ్లు మాత్రం రాత్రనకా పగలనకా డ్రగ్స్ గుడుంబాల కన్నా ప్రమాదకరమైన సీరియల్స్ ని ప్రజలకి అలవాటు చేయడంలేదా?తమ తమ శక్తి మేరకు జనాల మానసిక ఆరోగ్యంతో ఆడుకోవడం లేదా?వీళ్లు మాత్రం సంఘ విద్రోహ శక్తులుకాదా?"


సీరియళ్లనే కాదు టీవీ కార్యక్రమాలు కూడా భ్రష్టు పట్టించడంలో మొట్ట మొదటి స్థానం ఎవరిది అనుకోగానే మన మనసు స్క్రీన్ పై "ప్రజంట్ సార్"అని ప్రత్యక్షమయ్యే రూపం అమన్(పేరు మార్చాం).వీక్లీ సీరియల్ గానే "వింతరంగాలు" 5 సెంచరీల ఎపిసోడ్లకి పైగా నడిపించారంటే,జనాల సహనం కన్నా,వాళ్లని అయిదొందల వారాల పాటూ ఎదవల్ని చేసినఅమన్ ప్రతిభని మెచ్చుకోవాలి. అమన్ మహాశయులకి ఈమధ్య ఓ గొప్ప ఆలోచన వచ్చిది.తీసేవాడికి చూసే వాడు లోకువ కనుక తీసి చూపించారు.పౌరణిక సినిమా(???) ఒకటి తీసి ఏనాడో వెండితెర చేసుకున్నపుణ్యం కొద్దీ, ఎన్ టీఆర్,శోభన్ బాబుల్ని చూసిన పాత్రలో అమన్ ని చూసే (దౌర్)భాగ్యం కోల్పోయింది.ఆ సినిమాధియేటర్ల మీదకి వదలకుండా,ఆటీవీ మీదకు "ఉస్కో" అన్నాడు.జనమంతా ర్యాబిస్ ఇంజక్షన్లకి భయపడి ఛానల్మార్చేశారు,అదే సమయానికి నా జాతకంలో శనిగాడు 7 హౌస్ కి అడ్వాన్స్ ఇచ్చి సామాలతో సహా దిగుతునాడు. ఆరోజు మా ఇంట్లో వంశీ కృష్న,రాజేష్,శివ గాడు ఉన్నారు."వంశీ ఆటీవీ పెట్టు"అన్నాను నేను.వాడు ఆటీవీ నెంబర్ ఎంత అన్న విషయమ్మీద రీసెర్చ్ మొదలుపెట్టాడు."రేయ్ ఛానల్ నెంబర్2" అన్నాను.ఇంతలో మా శివ గాడు(వీడికి జీకేఎక్కువ)"ఏయ్ ఆగు ఇప్పుడు ఆటీవీ అమన్ గాడి సినిమా వేసుకుంటున్నారు.వేరే చానల్ పేట్టమను లేకపోతేకట్టమను",అన్నాడు. నాలో సుభాకర్ నిద్రలేచాడు.లేచి"ఇహహ్హహ్హహ్హా",అని ఇంటికి లాక్ చేసి,ఆటీవీ పెట్టి రిమోట్బీరువాలో దాచి దాన్నీ లాక్ చేసి,తాళాలన్నీ వరండాలో వేసేసా(రెండింటికి మా అమ్మా వాళ్లు వచ్చి తాళాలు తీసిస్తార్లేఅన్న ధైర్యంతో).సినిమా పేరు"శ్రీ రామ లక్ష్మణ యుద్ధం" ఆ పేరేంటో మా దరిద్రం."కృష్ణార్జున యుద్ధం" అంటేఒప్పుకున్నాం,"రామాంజనేయ యుద్ధం" అన్నా అర్ధం చేసుకున్నాం(నిజంగా ఆ యుద్ధలు జరిగినట్టు పురాణాల్లో లేకపోయినా).కానీ వాల్మీకి కూడా జడుసుకునేలా రామ లక్ష్మణులకి మధ్య యుద్ధమేంటి.ముందుముందు సీతా రామయుద్ధం,రాధా కృష్ణ యుద్ధం తీస్తాడేంటో ఖర్మ(తథాస్తు దేవతలు కంగారు పడి తథాస్తు అంటేసంతోష్ అనే ఈ పాపిని అందరూ క్షమించాలి)
సినిమా విషయానికొస్తే అమన్ రాముడి పాత్ర పోషించాడు అనే కంటే,రాముడి పాత్ర అమన్ ని భరించింది అంటే డ్రమటికల్గా కరెక్ట్.రాముడిగా ముఖ కవళికల గురించి వదిలెయ్యండి రాముడు వంగి వంగి నడవడం గూనిగా ఎంటో.ఇంక డైలాగ్డెలివరీ గురించి చెప్పాలంటే అడ్డంగా ఎదిగిన పద్దెనిమిదేళ్ల కుర్రాడు చిన్నపిల్లల్లా ముద్దగా మాట్లాడినట్టు అమన్డైలాగులు చెప్తే ఉందీ...నా సామిరంగా...గ్రౌండ్ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది.అలాంటి సినిమానిగంట భరించే సరికి అందరికి బుర్రలు బ్లాకయి పోయాయి.అప్పటి మా తక్షణ సమస్య ఈ దాడినుంచి ఎలాతప్పించుకోవాలి
.రాజేష్:ఒరే నీ**** నీ***** నీకింత క్రాకేంట్రా నీ*** వంశీ:రిమోట్ కూడా దాచేసావు కదరా నా**** ఇంతలో టీవీ లోంచి అమన్ ముద్దగా:చివరికి న్యాపయ్ గౌరవం కన్న్యా... అంటున్నడువింటుండగానే ఇద్దర్లో రక్తం లావాలా పొంగింది అందుబాటులో ఉన్న సామగ్రితీసుకుని నా మీదకి వస్తున్నారు.రాం గోపాల్ వర్మా సినిమాలో రౌడీల్లా ఒకళ్ళ వంక ఒకళ్లు చూసుకుంటున్నారు.వర్మస్క్రీన్ ప్లే ప్రకారం చూసుకున్నా ఇంకొద్ది క్షణాల్లో నా బుర్ర పగలబోతోంది. నిశ్శబ్దాన్ని ఛేధిస్తూ మా శివ గాడు" ఏరా...టీటీదగ్గర బటన్స్తో ఛనల్ మారుద్దాం" అన్నాడు."అది రిమోట్తో లాక్ చేసుంది"అన్నాను భయంగా.అమన్ గాడుముద్దగా"లక్ష్మణ్ణా ఇకి న్యా ప్రతిఙ్ఞ్య..."అంటున్నాడు.మా వాళ్లిద్దరూ మళ్లీ పొజిషన్స్ తీసుకున్నారు.శివ గాడు"టీవీ ప్లగ్తీసేద్దాం"అని టైంలీగా ప్లగ్,స్విచ్ రెండూ తీసేసాడు.ప్రమాదం తప్పింది చెప్పొచ్చేదేంటంటే పల్నాటిబ్రహ్మనాయుడు,విజయేంద్ర వర్మ,అందరివాడు,జానీ,సుభాష్ చంద్రబోస్ లాంటి కళా ఖండ ఖండాల్ని చివరివరకూచూసిన మా ఓపిక అమన్ ముందు తల వంచింది.

శీను గాడి పెళ్లి చూపులు, Story in Telugu

అది ఏంటో నాతో పాటు చదివిన వాళ్ళు అందరు పెళ్లి చేసేసుకుంటున్నారు అప్పుడే ఏదో పెళ్లి వయసువచేసినట్టు నాకు ఏమో ఇంకా 23 (*కండిషన్స్ అప్లై). పెళ్ళిళ్ళ సునామీలో ఆఖరికి మా చింతపిక్కల శీను గాడికి కూడా ఒక పెళ్లి కాకా పోయిన ఒక పెళ్లి చూపులకి పిలుపు వచ్చింది. రోజు అమావాస్య నేను, కాష్మోరా , ఖాద్ర, పీరు సాయబు ( అన్ని ముద్దు పేర్లు) మా ఊరి స్మశానం క్రికెట్ అడుకుంటున్నాం ఇంతలొ శీను గాడు వచ్చి నాకు పెళ్లి చూపులు అని చెప్పాడు 1లీటర్ వాటర్ బాటిల్ తాగి 2లీటర్ల చెమట కక్కుతూ. వెంటనే న్యూస్ కి బాల్ వెళ్లి పక్కనే నిజంగా దెయ్యాలు ఉండే స్మశానం లో పడింది. బాల్ తీసుకురావటంకి పెళ్లి అయిన వాళ్ళు ఎవరు లేక పోవటం మ్యాచ్ ఆపేసి వీడి మ్యాచింగ్ ఏంటో విందాంము అని డిసైడ్ అయ్యాం.

ఏంటిరా అమ్మాయి పేరు ఏంటి వూరు ఏంటి అన్నాడు కాష్మోరా... మీ చెల్లి పేరు ఏంటి అంటే అని మొదలు పెట్టాడు.వాడికి మా మీద ఉన్నా నమ్మకం కి మాకే ఒకింత గర్వం గా అని పించింది. అమ్మాయి జీతం, ఆస్తి, పేరు చెప్పాడు బాగానే అనిపించింది వీడికి ఎక్కువ అని పించింది. రేపు పెళ్లి చూపులు మీరు కూడా రావాలి నాతో అన్నాడు. నో నాకు రేపు ఆఫీసు లో ఫుల్ బిజీ అని చెప్పా బెట్టు చేద్దాం అని. వర్కింగ్ డే లోనే స్మశానం లో ఆడుకుంటారు మీకు ఆదివారం పని ఏంటిరా అన్నాడు. కొంచం బతిమాలించుకుని సరే అని చెప్పాము.

అది శ్రవణ ఆదివారం సూర్యుడు పొద్దునే తొమ్మిది గంటలకే ఉదయిస్తాడు అని రోజే తెలిసింది. మా అమ్మ రాత్రి మిగిలిపోయిన డిన్నర్ ని బ్రేక్ ఫాస్ట్ చేసే పని లో ఉంది. అమ్మ శ్రవణ మాసం లో సూర్యుడి పొద్దున్న తొమ్మిది గంటలకే వొస్తడా అని అడిగాను. ఏమి నాయన ఎంత పొద్దునే లేచావు ఏమి ప్రళయం వస్తుందో అంది. శీను గాడి పెళ్లి చూపులు అని చెప్పా వాడి కి పెళ్లి చూపులు ఐతే నీకు ఏంటి దీనినే వుల్లో పెళ్లి కి ఏవో హడావుడి అంటారు అంది. అవి పెళ్లి కి కదా అమ్మ పెళ్లి చూపులకి కాదు కదా అన్నా. నా తెలివి తేటలకి మా అమ్మ వెంటనే చేసే పని ఆపేసి బట్టలు వుతకటం కి వెళ్ళింది. బట్టలు బాగా సౌండ్ చేస్తున్నాయి సౌండ్ కి మా ఇంటి గోడలు పగలు కొడుతున్నట్టు అని పించింది. అప్పుడు తెలిసింది మా అమ్మకి కోపం వొస్తే బట్టలు వుతుకుతుంది అని.
మా అమ్మకి బాగా కోపం వచ్చిన బట్టలే వుతుకుతుంది కాకా పొతే వంటి మిద ఉండగానే వుతుకుతుంది. ఇంతలొ నా ఎడమ కన్ను, కుడి కన్ను, గుండె, లివర్ అదరటం మొదలు పెట్టింది. ఏంటి శుభ శుచకం అని ఏమి జరుగుతుంది అని బాల్కనీ లో నుంచి కిందకి చూసాను. కాలేజీ కి వెళ్లి రెండు క్లాసులు అయిపోయి మా నాన్న ఇంటికి వొస్తున్నారు. ఇంకా ఎక్కువ టైం ఇంట్లో ఉండటం సేఫ్ కాదు అని వెంటనే మా అమెరికా మామ బ్యాగ్ లో దాచుకున్న సెంట్ తో స్నానం చేసి కొత్త చొక్కా ఒకటి వేసుకుని బయటకి పరిగెట్టాను. లిఫ్ట్ లో వెళ్ళటం కంటే మెట్ల మీద నుంచి దిగటం ఆరోగ్యం కి మంచిది అని అని దిగటం స్టార్ట్ చేశాను ( నిజం ఏంటి అంటే మా నాన్న లిఫ్ట్ లో వొస్తే మనం మెట్లు , మెట్ల మీద వొస్తే మనం లిఫ్ట్).

శీను గాడి ఇంటికి వెళ్ళాం వాడు ఇంకా రెడి అవ్వలేదు షర్టు లేకుండా తిరుగుతున్నాడు. మేము అందరం వెళ్ళగానే ఒరేయ్ ఏంటి రా డ్రెస్సులు నా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి వెళ్లి మంచి బట్టలు వేసుకు రండి అన్నాడు. అందరు మల్లి డ్రెస్సు లు మార్చటం కి కి వెళ్లారు. నేను ఇంట్లో మా టైగర్ ఉండటం వల్ల ఆగి పోయాను. సారి మంచి మెరుపు షర్టు లు వేసుకోచారు. శీను గాడి ఒక్కొక్కడి షర్టుకేసి ఆశగ చూస్తున్నాడు. రమేష్ గాడి షర్టు నచ్చింది బలవంతం గా వాడి షర్టు ఉడతియించాడు.

పదకండు గంటలు అవుతుంది వెళ్దామా అని తొందర పడుతున్నాడు శీనుగాడు వాడి చేతికి గోళ్ళు అన్ని అయి పోయినాయి ఇంకా ఏమి కోరుక్కోవలో తెలియక. వాళ్ల నాన్న పన్నెండు గంటలకి వెళ్తే అక్కడే భోజనం చేసి రావచ్చు అని లోపల ఉన్నా మాస్టర్ ప్లాన్ ని బయట పెట్టారు. పన్నెండు గంటలకి స్టార్ట్ అయ్యాము ..ఒకే ఆటో లో పదకండు మంది ని ఎక్కించాడు వాళ్ళ నాన్న మా బైక్ మీద వస్తాం అంకుల్ అన్నా అమ్మ అయ్యా సంపాదిస్తుంటే మీకు నొప్పి తెలియటం లేదు అందరు ఒకే ఆటో ఎక్కండి అన్నాడు. ఆటో వాడు బ్రేక్ అనుకుని నా కాలు ని బ్రేక్ చేసాడు. తొమ్మిదోవ నెంబర్ కాలు ఆటో దిగే సరికి పన్నెండో నెంబర్ అయ్యింది. భోజనాల టైం కి చేరుకున్నాం. శీను గాడు సెంటిమెంటల్ గా రాహు కాలం వరకు వెయిట్ చేసి లోపల అడుగు పెట్టాడు.

కాఫీ తాగుతారా అని సౌండ్ కి నాకు ప్రాణం లేచి వచ్చింది ఆటో వాడు బాగా కాలు తొక్కటం తో తల నొప్పి వచ్చింది. భోజనం చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నా శీను గాడి బాబు అందరి తరుపున ప్రతిపక్ష నాయకుడిల నో చెప్పాడు. పెళ్లి కూతురి తండ్రి అయ్యో ఇంక బోజనాలు పెడదాం అనుకున్నాం కాఫీ తాగటంకే ఖాళీ లేని వాళ్ళు బోజనాలు ఏమి చేస్తారు కనీసం వాటర్ అన్నా తాగండి ఏమి తాగకుండా వెళ్తే మాకు మాట వస్తుంది అన్నడు మాటకీ శీను గాడి బాబు కి నోట మాట రాలేదు.
నాకు అర్ధం పోయింది ఆరు నూరు అయిన నూరు నుటయబాయి అయిన పెళ్లి జరుగుతుంది అని.

అమ్మాయిని నాన్న షాక్ నుంచి తేరుకునే టైం కి ఇంకో షాక్ అమ్మాయి వచ్చింది అమ్మాయి మెడ లో బోర్డు రాసి ఉంది పెళ్లి కూతురు అని. అందం చాల మందం గా ఉంది. బ్యూటీ పార్లర్ నడిచి వస్తున్నట్టు ఉంది. అమ్మాయి రావటం తోనే గది లో కొంచం మేఘాలు కమ్ముకున్న ఫీలింగ్ వచ్చింది. వెంటనే రెండు ట్యూబ్లయిట్లు వేసి కాండిలు వెలిగించారు. అమ్మాయి కాలి వేళ్ళతో తెగ ముగ్గులు వేసేస్తుంది కొంచం ఉంటే గ్రౌండ్ వాటర్ వస్తుంది ఏమో అని డౌట్ వచ్చింది. శీను గాడిని చుస్తే వాడు కూర్చున్న కుర్చీ పెయింటు పీకేస్తున్నాడు. వీడి కి సిగ్గు లేదు అని మా క్లాసు అమ్మాయి
అంతా అన్నది నిజం కాదు అని మాకు తెలిసింది.

తరవాత పోస్ట్ లో మన శీను గాడి ప్రశ్నలు మందంగా ఉన్నా అందమయిన అమ్మాయి సమాదానం తోకలుద్దాం.
Blogger Tips And Tricks|Latest Tips For Bloggers Free Backlinks

How is Narendra Modi Work?